Site icon 123Nellore

అలా చేస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం : చంద్రబాబు

పార్టీలో కొందరు నేతల పనితీరుపై చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.  క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేసే నేతలకు చెక్ పెడతానన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లోకేష్, అచ్చెన్నాయుడుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పనిచేసే వారెవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందని, సీనియార్టీని గౌరవిస్తాం.. సిన్సియార్టీని గుర్తిస్తామని స్పష్టం చేశారు. సీనియార్టీ ఉన్నా ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ప్రశ్నించారు.? ఓట్లు వేయించలేని సీనియార్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటామని తెలిపారు. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, తటస్తులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తామన్నారు. సమాజ హితం కోసం టీడీపీ అవసరముంది.. అందుకే విరాళాల సేకరిణ అని, పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చని పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వం తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్ఆర్ఐల వరకు వెళ్లిందని, నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. 4 వేల మందికిపైగా బీమాకల్పిస్తున్నామని, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామన్నారు.

కార్యకర్తలకు ఆర్థిక సాయంతోపాటు పింఛన్లు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. వైసీపీ పాలనో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, సమర్ధులైన వారిని కుల మతాలకతీతంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ రావాలని మొదట కోరుకున్నది తానేనని, నీతి, నిజాయితీగా పార్టీ కోసం పనిచేయాలని తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ప్రతి కార్యకర్తను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి జరిగిన నష్టం మాములుది కాదు.. ప్రజలు భయపడిపోతున్నారని,  రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేయాలని వివరించారు.

 

Exit mobile version