గతంలో చంద్రబాబుపైనా, అమరావతి రైతులపైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసి సంచలనం రేపిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నింటినీ సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనన్నారు. శ్రీకాకుళం జిల్లా చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ధర్మాన కృష్ణదాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది జగన్ ఇంకోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కాకపోతే నా ఆస్తులన్నీ తెలుగు దేశం పార్టీకి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు.
నభూతో న భవిష్యతి గా జగన్ పాలనను అభివర్ణించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని.. ఆయన మాట ప్రకారం తాను ప్రతి ఇంటికి వస్తానని వెల్లడించారు. త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్ తన పదవి కోల్పోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నీ టీడీపీకి రాసిచ్చేస్తానని ప్రకటించారని తెలిపినట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణదాస్.. వైసీపీ స్థాపించినప్పుడు జగన్ కు పక్కన చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నా కూడా.. కృష్ణదాస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ పోటీ చేసి గెలిచారు. 2014లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కృష్ణదాస్ వ్యాఖ్యలు శ్రీకాకుళంలో చర్చీయాంశంగా మారాయి.