స్టార్ హీరో కమల్ హాసన్ ముద్దుబిడ్డ శృతి హాసన్ గురించి అందరికీ పరిచయమే. సూర్య నటించిన ‘సెవెంత్ సెన్స్’ సినిమాతో తెలుగు తెరకు దగ్గరైన ఈ భామ.. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. రీ ఎంట్రీ తో ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ వెలుగు వెలుగుతుంది.
ఇక శృతిహాసన్ వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. శృతి సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా లో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామ గతంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతన్ హాజరికాను అభిమానుల ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిరువురు ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్రేజీ క్విజ్ లో పాల్గొన్నారు. అందులో ఈ జంట కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఇద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేసుకున్నారు అని ప్రశ్న రావడంతో.. శృతిహాసన్ హజారికా కు తానే మొదట ‘ఐ లవ్ యూ’ అని చెప్పినట్టు తెలిపింది. ఇదే కాకుండా ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్ గా ఉంటారా అని అడగగా.. వారిద్దరు ఒకరినొకరు చూపించుకున్నారు. కాగా వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమ లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని శృతిహాసన్ గత ఏడాదే సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ తెలియజేసింది.