Site icon 123Nellore

మా పేర్లు చెప్పొద్దు..ఎంత డబ్బైనా ఇస్తాం..వివేకా హత్య నిందితుడికి భారీ ఆఫర్ ..!

హత్యలో మా ప్రమేయం ఉందని చెప్పొద్దు. నీకు పదెకరాల భూమి ఇస్తాం, కావాల్సినంత డబ్బు ఇస్తాం అంటూ వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరికి భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాలు ఇప్పుడు బయటకు రావడంతో ఇప్పుడు సంచలనం రేపుతోంది. తనను కలిసిన వారి వివరాలను దస్తగిరి గతేడాది సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం ఉంది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు దస్తగిరి.

బాధలు తట్టుకోలేకే తాను అప్రూవర్‌గా మారానని చెప్పుకొచ్చారు.  అప్రూవర్‌గా మారిన తర్వాత భరత్ యాదవ్ తనను కలిశారని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు దస్తగిరి తెలిపారు.  తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్, న్యాయవాది వచ్చారని వివరించారు. వీరిని భాస్కర్ రెడ్డి(అవినాష్ రెడ్డి తండ్రి) శంకర్ రెడ్డి పంపించారని అన్నారు. తమ పేర్లు సీబీఐ వద్ద ప్రస్తావించకుండా ఉంటే 10-20 ఎకరాల భూమి ఇస్తామని,  ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. భరత్ యాదవ్ తరచుగా తనను కలుస్తాడని చెప్పారు.

ఇదిలా ఉండగా వివేకా కేసు సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై కేసు నమోదైంది.  రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వివేకా హత్యకేసులో తాము చెప్పినట్లు చెప్పాలని రాంసింగ్ ఒత్తిడి చేశారని వివరించారు. అయితే రాంసింగ్ పై కడప రిమ్స్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ముగింపు దశకు వస్తున్న తరుణంలో కథ రోజుకో అడ్డం తిరుగుతోంది.

 

 

Exit mobile version