Site icon 123Nellore

Beauty Tips: మందపాటి కనుబొమ్మలు లేవని చింతిస్తున్నారా ? అయితే ఈ చిట్కాలు మీకోసమే

Beauty Tips: కనుబొమ్మలు స్త్రీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. కనుబొమ్మలు పల్చగా ఉంటే అందానికి లోటనే చెప్పాలి. అయితే అందమైన మందపాటి కనుబొమ్మల కోసం చాలా మంది మార్కెట్ లో దొరికే వివిధ క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కనుబొమ్మలు సన్నగా ఉన్నవాళ్లు అలానే కనుబొమ్మలను పెద్దగా వెడల్పు చేసుకోవడానికి సహజసిద్ధంగా నిత్యం మన ఇంట్లో ఉండే వాటితో కనుబొమ్మలను పొందవచ్చు. అవి ఏంటో తెలుసుకోండి మరి.


కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో కనుబొమ్మలపై మెల్లగా మర్దన చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా కనుబొమ్మలు మందంగా మారడంలో కొబ్బరి నూనె చాలా సహాయపడుతుంది.

గుడ్లు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం గుడ్డు పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కోడిగుడ్డు సొన మిశ్రమాన్ని బ్రష్‌తో కనుబొమ్మలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. ఇది కనుబొమ్మలను వత్తుగా చేయడానికి సహాయపడుతుంది.

ఆముదం నూనె కనుబొమ్మలు గట్టిపడటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి నిద్రించే ముందు కొన్ని చుక్కల ఆముదంతో, కనుబొమ్మలను బాగా మసాజ్ చేయండి. ఆ మరుసటి రోజు నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఆముదం ప్రతి రోజు చేయడం వలన తక్కువ వ్యవధిలో ఫలితం పొందవచ్చు.

Exit mobile version