ప్రతి మనిషికి నిద్ర అనేది తప్పనిసరి నిద్ర లేకపోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఫోన్స్ ,కంప్యూటర్స్ ,లాప్టాప్ ఉపయోగించడం వల్ల చాలామందికి నిద్ర లేని సమస్యలు అధికంగా వస్తున్నాయి. నిపుణుల ప్రకారం రాత్రి 9:00 నుండి ఉదయం 5 గంటల వరకు నిద్రించిన వారు ఆరోగ్యంగా ఉంటారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.అయితే నిద్ర సరిగ్గా లేకపోతే మానసిక ఒత్తిడితోపాటు అలసట, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు శరీరానికి తగినంత నిద్ర లేకపోతే మరణానికి దారితీస్తుందని ఇటీవల హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్ బోధకుడు రెబెకా రాబిన్సన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
శరీరానికి సరైన నిద్ర అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది నిద్రలేమి. మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు ఒత్తిడి సమస్యలతో నిద్రలేమి బారిన పడుతున్నారు. నిద్రలేమి సమస్యను అధిగమించాలంటే మన ఆహారపు అలవాట్లను కొన్నింటిని మార్చుకుంటే సరిపోతుంది. నిద్రించేముందు ఆహారాన్ని 2 లేదా 3 గంటల ముందే తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి అనేది ఉండదు. నిద్రించే ముందు గ్లాస్ పాలు తాగడం వలన పాలలో కాల్షియం అధికంగా ఉండటం వల్లన గాఢమైన నిద్ర వస్తుంది. అరటి పండ్లు తీసుకోవడం వల్ల కూడా నిద్ర వస్తుందా అలానే చేపలు వాల్నట్స్, బాదములు, గుమ్మడి విత్తనాలు, తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు.