Site icon 123Nellore

ఆరోజు మహేష్ బాబుతో కలిసి బీరు తాగాను అంటున్నా హీరో అశోక్ గల్లా!

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘హీరో’ సినిమాతో కుర్ర హీరోగా పరిచయం కానున్న నటుడు అశోక్ గల్లా. ఈ కుర్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అన్న సంగతి చాలా వరకు ఎవరికీ తెలియదు. ఇక అటు పొలిటికల్ గా ఇటు మేనమామ మహేష్ బాబు ఇమేజ్ ను క్యాచ్ చేసుకొని సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు.

Ashok Galla And mahesh Babu

ఇక ఈ సినిమా షూటింగ్ ముగించుకున్న అనంతరం ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ సూపర్ కాంబో అంటూ.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్ల నేపథ్యంలో అశోక్ గల్లా వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అశోక్ గల్లా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు.

ఇక అశోక్ గల్లా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అశోక్ తన మామ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి బీరు తాగినట్లు తెలిపాడు. అతనికి 18 సంవత్సరాలు రాగానే ఇంట్లో ఒకసారి మహేష్ బాబు గారు పక్కన ఉండగానే బీర్ తాగాను అని చెప్పాడు. ఆయన తనను అప్పుడు ఒక డిఫరెంట్ లుక్ లో చూసాడు అని తెలిపాడు అశోక్ గల్లా.

Exit mobile version