Site icon 123Nellore

ఇలా చేస్తే ఎవ్వరైనా అందంగా కనిపిస్తారట?

అందానికి ఎవరూ దాసోహం అవ్వరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందంగా కనిపించాలని మార్కెట్లో దొరికే
వివిధ క్రీమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ క్రీమ్స్ ను ఉపయోగించడం వల్ల చర్మంలో కొన్ని కణాలు నశించి పోవడం వలన చిన్న వయసులోనే వృద్ధాప్యం ముడతలు మన శరీరం మీద ఏర్పడతాయి. అయితే ఎటువంటి క్రీమ్స్ ఉపయోగించకుండా మన శరీరాన్ని అందంగా మార్చుకోవడానికి అలానే నిత్యం యవ్వనంగా కనిపించే విధంగా మన ఆహార జీవనశైలిని మార్చుకుంటే ఉంటే చాలు. మొదటి పని పొగ త్రాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానుకోవాలి.ఎక్కువగా సేంద్రీయ ఆహరం మాత్రమే తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.

క్యారేట్లలో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం యొక్క వయసును తగ్గించడంతో పాటు చర్మ వ్యాధుల నుండి కుడా కాపాడుతుంది. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవకాడోలో విటమిన్ E ఉంటుంది, ఇది ఒక ప్రతిక్షకారినిగా కూడా పని చేస్తుంది. అందువలన చర్మం మృదువుగా మారి చర్మం యొక్క తేమని పెంచుతుంది.

కాలిఫ్లవర్, గ్రీన్ కాలిఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు చర్మ రక్షణకి తోడ్పడుతాయి. ఇవి చర్మ క్యాన్సర్ నుంచి కాపాడి చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ కురగాయలు వివిధ హార్మోన్ల స్థాయిలను సమానంగా నిర్వహించడం గమనించారు నిపుణులు. ఈ విధంగా సేంద్రీయ ఆహార పంటలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు నిత్యం యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.

Exit mobile version