Site icon 123Nellore

ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి తింటున్నారా… అయితే బిడ్డకు చాలా ప్రమాదం

healthy food tips for pregnant women

గర్భం దాల్చిన వెంటనే ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి ఇది తెలియక చాలామంది మహిళలు గర్భాన్ని పోగొట్టుకుంటారు. మరీ ముఖ్యంగా ఆహార పదార్థాలు తీసుకునే విషయాలలో గర్భం ధరించిన స్త్రీలు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భ సమయంలో మీరు అనుసరించే ఆహర ప్రణాళికలో వీటికి దూరంగా ఉండేలా చూసుకోండి. అధికంగా పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలానే  గర్భం సమయంలో కాస్త బద్ధకంగా కనిపించడం వలన వాటిని కడగకుండా తింటూ ఉంటారు అలా తినడం వలన దాని మీద ఉండే బ్యాక్టీరియా దుమ్ము, ధూళి నేరుగా బిడ్డకు చేరే అవకాశం ఉంటుంది. కావున వాటిని  శుభ్రంగా కడిగి తినటం మంచిది. గర్భం దాల్చిన విషయం ఆ మహిళకు మొదటి నెలలో తెలుస్తుంది అప్పుడు ఆ స్త్రీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అవి ఏంటో తెలుసుకోండి.

పచ్చి మాంసము, పచ్చి గ్రుడ్డ్లు … గర్భ సమయంలో సాల్మొనెల్లా వలన కలిగే వ్యాధులను కలుగచేస్తాయి. కావున గ్రుడ్డు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి. ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బట్టర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాగ్, వంటివి కూడా తినకండి. గర్భంతో ఉన్నపుడు తీయటి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. వైద్యులు తెలిపిన విధంగా 9 నెలలు సరిపోయేంత షుగర్’ని తీసుకుంటే సరిపోతుంది. గర్భ సమయంలో అధిక తీయటి పదార్థాలను తీసుకోవటం మంచిది కాదు అని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. మాంసం లో ‘లిస్టిరియాసిస్’లను కలుగ చేసే వాటితో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇవి గర్భాన్ని నిరోధించే పదార్థాలను కలిగి ఉంటాయి అందువలన వీటిని గర్భ నిరోధక ఆహార పట్టికలలో చేర్చారు. కారణం ఇవి శరీరంలో వేడిని 165 డిగ్రీల వరకి పెంచి, మీకు మరియు మీ కడుపులో పెరుగుతున్న శిశువుకి హాని కలిగిస్తాయి.

Exit mobile version