Site icon 123Nellore

ప్రెగ్నెన్సీ సమయంలో అది తక్కువ అయితే బిడ్డ పెరుగుదలకు ప్రమాదం అని తెలుసా!!!

స్త్రీకి గర్భం అనేది పునర్జన్మ వంటిది అని పురాతన కాలం నుండి వింటూ వస్తున్నాం. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం ధరించిన వారికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం బిడ్డ పెరుగుదల కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల పురిటిలోనే కొన్ని వందల మంది శిశువులు మరణిస్తున్నారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు అనే విషయాల గురించి కొంతవరకైనా అవగాహన ఉండాలి.బిడ్డ పెరుగుదలకు విటమిన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అధికంగా విటమిన్స్ కలిగిన ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బిడ్డ పెరుగుదలకు ఫోలిక్‌ యాసిడ్‌ అనే ‘బి’ విటమిన్‌ చాలా అవసరం.ఇది బిడ్డ మెదడు, వెన్నుముక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ డి కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మించారు. పాలు పండ్లు తమ దైనందిక జీవితంలో తప్పనిసరి. అలాగే విటమిన్ సి కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కి గురి అవ్వరు. ప్రెగ్నెన్సీ సమయంలో మాంసాన్ని అతి తక్కువ తీసుకోవడం మంచిదని తెలుపుతున్నారు. విటమిన్ సి అనేది ప్రెగ్నెన్సీ సమయంలో అతి ముఖ్యమైనది. అలానే సీ ఫుడ్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అధిక ప్రోటీన్లు పొందగలరు. చికెన్ కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు తీసుకోవడం వల్ల బిడ్డ పెరుగుదలకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోరాదు. ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం కూడా తీసుకోరాదు. సహజసిద్ధమైన జ్యూస్ ను మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలి మరియు పీచు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై అధిక ఒత్తిడి పడదు.

Exit mobile version