ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో 60 % మంది నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వీరిలో ఉద్యోగాలు చేసే వారు, పనులు నిమిత్తం ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా ఈ బాధతో సతమతమవుతున్నారని తెలుస్తుంది. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో ఎక్కువ సేపు కూర్చొని ఉండడం ఈ సమస్యకి ప్రధాన కారణం. పలు సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. అయితే కొన్ని సంధర్భాల్లో మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ నడుం నొప్పి నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి సర్వసాధారణం. కొన్ని చిట్కాలతో ఈ నడుం నొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
ఖాళీ సమయాల్లో యోగా చేయడం, లేదా ఆటలకు సమయాన్ని కేటాయించడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
అదే విధంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కోర్చోవద్దు. మీరు కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు వంగిపోకుండా నిటారుగా ఉండేందుకు ప్రయత్నించండి.
మితంగా ఆహారాన్ని తీసుకోవాదం ఉత్తమం. అధికంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎక్కువ బరువులను ఎత్తినప్పుడు హఠాత్తుగా వంగడం లాంటివి చెయ్యొద్దు.
ధూమపానం అలవాటు ఉన్న వాళ్లు మానేయడం మంచిది.
పలు సార్లు నిద్ర పోవడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గించుకోవచ్చు.