Site icon 123Nellore

ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే కిడ్నీల్లో రాళ్ళు ఉన్నట్లే ?

health-tips-about-detecting-stones-in-kidneys

ప్రస్తుత కాలంలో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కిడ్నీలో రాళ్లు సమస్యతో అధికముగా బాధపడుతున్నారు. మారుతున్న కాలానుసారంగా వివిధ రకాల ఆహారానికి అలవాటు పడటం ద్వారా ఈ సమస్య అధికమవుతుంది. మనం తీసుకునే ఆహారపు నియమాలను కాస్త మార్చుకుంటే ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ సమస్య చిన్న వారిలో అధికంగా కనిపిస్తుందని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయా ? అనే సందేహంతో ఉన్నట్లయితే ఈ స్టోరీ మీకోసమే. కిడ్నీలో రాళ్లు ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా…

కిడ్నీలో రాళ్లు మూడు రకాలుగా ఏర్పడతాయి. అవి కాల్షియం రాళ్ళు, స్ట్రువైట్ రాళ్ళు, యూరిక్ యాసిడ్ రాళ్లు. అయితే సాధారణంగా ఈ సమస్యను ముందుగా గుర్తించలేరు. అయితే కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడే వారిలో పక్కటెముకల కింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి కడుపు, గజ్జలు కు వ్యాపించే నొప్పి మూత్ర విసర్జన సమయంలో నొప్పి వస్తుంది. అలాగే మూత్రంలో రంగు మార్పు, వికారం, వాంతులతో కూడిన జ్వరం, చలి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

ఈ సమస్యతో బాధపడే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ వంటివి దూరం చేసుకోవచ్చు. అధికముగా నీటిని తీసుకోవడం, టమాటా పాలకూర మాంసకృత్తులు వంటివి తీసుకోకపోవడం మంచిది. ప్రోటీన్ కొరకు బీన్స్ తీసుకోవడం మంచిది ఒక కప్పు వండిన బీన్స్ లో 15 – 20 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. బీన్స్‌లో ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి వీటితో పాటు ఆకుకూరలు వంటివి అధికంగా తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version