కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రతలు పాటించారు. మళ్ళీ ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోవడంతో ఇక ఎప్పటిలానే యధావిధిగా బ్రతికేస్తున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం కోసం నడవడం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతూ ఉంటారు. రోజుకు కనీసం ఒక పది నిమిషాలు నడిచినా ఆరోగ్యం బాగుంటుందని వారు సూచిస్తారు. అయినా కానీ కొందరు మాత్రం చిన్న చిన్న పనులకు కూడా బైక్ లని వాడుతూ పూర్తిగా నడవడమే మానేసారు. దీని మూలంగా నేడు ఎంతో మంది అనేక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. నడిస్తే మన ఆరోగ్యం బాగుంటుందని తెలిసినా కూడా దాన్ని పట్టింకుకోవడం లేదు.
వాకింగ్ చేయకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగా రోజులో కాసేపు చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వ కాలంలో చాలా మటుకు చెప్పులు లేకుండానే నడిచేవారు. కానీ ప్రస్తుతం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా చెప్పులను వేసుకునే బయట అడుగుపెడతారు. అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకోసం ప్రత్యేకంగా…
రక్త సరఫరా మెరుగ్గా జరగడానికి కూడా వట్టి కాళ్లతో నడవడం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంలోను ఈ నడక ఎంతో ఉపకరిస్తుంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరం త్వరగా రిలాక్స్ అవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు తొందరగా నిద్రపోవడానికి ఇది బెస్ట్ మార్గం.
చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు కూడా ఈ నడక బాగా ఉపయోగపడుతుందట. కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.