Site icon 123Nellore

కొర్రలతో అనేక అనారోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసా?

Millets: ప్రస్తుత కరోనా కాలంలో అందరిలోనూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. కనుక తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొర్రలను తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో అనేక మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొర్రలు శరీరానికి మంచి హెల్తి ఫుడ్. ఇందులో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, తక్కువ కొవ్వు పదార్థాలు, మెగ్నీషియమ్, ఐరన్, జింక్‌ వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, బి1, బి2, బి5, బి6, విటమిన్‌ ఇ వంటి విటమిన్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. కనుక మనం తీసుకునే ఆహారంలో కొర్రలను భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు

ఎముకలు దృఢంగా ఉంటాయి: కొర్ర‌ల‌లో ఉండే అధిక మొత్తంలో క్యాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

కండరాలను ఆరోగ్యంగా ఉంటాయి: కొర్ర‌ల‌లో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే కండరాలకు తగిన ఆక్సిజన్ అందుతుంది. దాంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

అనీమియా సమస్యలు తగ్గుతాయి: కొర్ర‌ల‌లో ఉండే ఐరన్ ను అనీమియా సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక కొర్రలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: కొర్ర‌ల‌లో ఉండే అనేక రకాల విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరిచి మెదడును యాక్టివ్ గా ఉంచుతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి జ్ఞాపకశక్తి ఏకాగ్రతను పెంచుతాయి.

గుండె జబ్బులు తగ్గుతాయి: కొర్రలను తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ బి1 గుండె జబ్బులు రాకుండా సహాయపడి అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.

డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది: కొర్రలు రక్తంలో చక్కెర స్థాయిలను కలవడాన్ని నెమ్మదిపరుస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కొర్రెలను తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

బరువును నియంత్రణలో ఉంచుతుంది: అధిక బరువుతో బాధపడుతున్న వారు కొర్ర‌ల‌ను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో కొర్ర‌ల‌ను చేర్చుకోవడం మంచిది.

Exit mobile version