ఆరోగ్యం జీవితం పొందాలంటే సమతుల్యమైన ఆహారం సరిపడా నీళ్లు రోజు కాసేపు వ్యాయామం ఇలాంటివి పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ మన రోజువారి ఆహారంలో పోషక విలువలు తక్కువ జంక్ ఫుడ్ అధికంగా ఉంటుంది. కాగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆకు కూరలు, పండులు, కూరగాయలు బాగా సహాయ పడతాయి. వాటితో పాటు రోజువారీ ఆహారంలో మొలకలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. పెసర గింజలు మొలకలు రూపంగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ స్పెషల్ స్టోరీ మీకోసమే…
అందరికీ అతి తక్కువ ధరలో దొరికే పెసలు వీటిని మొలకలు కింద చేసుకొని తినడం వల్ల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మొలకలు ఈ రోజు ఉదయం తీసుకోవడం ఎముకలు, కండరాలు దృడంగా మారుతాయి. దీనిలో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాధులతో పోరాడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలానే అధిక బరువు ఉన్నవారు మొలకలు తీసుకోవడం వల్లన మంచి ఫలితాన్ని పొందుతారు.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు రోజు మొలకలు తీసుకోవడం వల్ల ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. మొలకలలో పీచు పదార్థం అధికంగా ఉండటం మలబద్ధకం సమస్యను నివారించుకోవచ్చు. స్త్రీలు రుతుచక్రం సమస్యలతో బాధపడుతున్నవారు కూడా మొలకలు తీసుకోవడం వల్ల ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మొలకలు మంచి ఆహారం అని… చిన్నవారి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ మొలకలను ఆహారంలో తీసుకోవాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.