వంటకాల్లోనూ, చర్మ సౌందర్యానికి టమాటాలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. టమాటతో చట్నీ, కూర, సూప్, జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూరల్లోనూ టమాటా నూ వినియోగిస్తారు. అలాగే టమాటాలను క్రమం తప్పకుండా, సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటాలతో చేసిన ఆహారం, జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
వేడి సమస్య : మీకు కడుపులో వేడి, మంట సమస్య అనిపిస్తే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది. టమోటాలు తినడం వల్ల రోజంతా మీ శరీరంలో శక్తి ఉంటుంది.
బరువు తగ్గెందుకు : బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు.
మెరుగైన కంటి చూపు : కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, కాంతిని పెంచేందుకు పచ్చి కూరగాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం ఉత్తమం.
రోగ నిరోధక శక్తి పెంపుదల : రోగ నిరోధక శక్తిని పెంచడానికి టమాటాలు సహాయ పడతాయి. శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని టమాటా మెరుగుపరుస్తుంది.