ఇటీవలే శివరాత్రి ముగిసింది. సాధారణంగా శివరాత్రికి చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభం అవుతుంది అని అందరూ అంటూ ఉంటారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తే ఎండలు బాగా బలంగా ఉంటున్నాయి. ప్రజలు భీతిల్లిన సంధర్భాలు కూడా చాలా ఎదురయ్యాయి. ఒకప్పుడు మట్టి పాత్రలు, మట్టి కుండలను బాగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు స్టీల్, ప్లాస్టిక్ పరికరాలలో నీటిని తాగుతున్నారు. మళ్ళీ ఎండాకాలం దగ్గర పడుతుండడంతో రిఫ్రిజిరేటర్, కుండలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
మట్టి కుండలు బాష్పీభవనం సూత్రంపై పనిచేస్తాయి. అంటే ఇవి నీళ్లను ఎప్పుడూ చల్లగా ఉంచుతాయి.
బంకమట్టి కుండా పోరస్ అయినందున క్రమంగా నీటిని చల్లబరుస్తుంది.
మట్టికుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండి శరీర గ్లూకోజ్ స్థాయిని తగ్గకుండా చేస్తాయి.
మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది.
పీహెచ్ సమతుల్యతను కాపాడి యాసిడిటి సమస్యను తగ్గిస్తుంది.
ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం వలన అందులో ఉండే బిస్ ఫినాల్ ఏ, బీపీఎ వంటి రసాయనాలు శరీరానికి హాని కలిగిస్తాయి.
ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనినే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అని కూడా అంటారు.
మట్టి కుండలోని నీరు త్రాగటం టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో అయినా మట్టి కుండలో నీరు తాగుదాం…