నెయ్యి ఆహారంలో తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మందికి అపోహ. పరిమితిలో నెయ్యి సేవించడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవు అని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం ద్వారా అధిక బరువు నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని తెలుపుతున్నారు ఎందుకంటే నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్ ఎ, డి, ఇ, కె కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉదయాన్నే కాఫీ టీ వంటి పానీయాలు స్థానంలో
నెయ్యిలో సేవించడం ద్వారా ఆరోగ్యం పాటు ముఖ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీలు రెండు లేదా మూడు స్పూన్లు పరగడుపున నెయ్యి సేవించడం ద్వారా బిడ్డ పెరుగుదల సహాయపడుతుంది. నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారికి నెయ్యి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.నెయ్యిలో ఉండే ఒమెగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రరాల్‌ను తగ్గిస్తుంది. చిన్నపిల్లలు నెయ్యి తీసుకోవడం ద్వారా ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.