మనలో చాలా మందికి పక్షులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది అనేక రకాల పక్షులను ఇండ్లలో పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో భాగస్థులను చూసినట్లు చూస్తారు. వాటికి కావాల్సినవి సమయానికి అరెంజ్ చేస్తారు. వాటికంటూ ప్రత్యేక ఆహరం సిద్ధం చేస్తారు. ఇలా ఇంత ప్రేమగా చూసుకునే ఆ పెంపుడు జంతువులు తప్పి పోతే చాలా బాధ పడుతారు. ఇలాంటి బాధనే అనుభవిస్తున్నారు. బిహార్ లోని గయాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు. ఇంతకీ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.
గయాలో ఉండే శ్యామ్ దంపతులకు ఓ చిలక అంటే చాలా ఇష్టం. వారు దానిని సుమారు 12 ఏళ్ల నుంచి పెంచుతున్నారు. దానిని వారు సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే వారు. అయితే ఆ చిలక ఇటీవల వారి ఇంటి నుంచి పారి పోయింది. దీంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే వారు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు చిలుకకు సంబంధించిన ఎటువంటి ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
అయితే వారు చేసేది ఏమీ లేక ఓ వినూత్న ప్రయత్నానికి తెరలేపారు. గయాలో ఉన్న ఎవరైనా సరే చిలుకను గాని వారికి తెచ్చి ఇస్తే వారికి మంచి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పాంప్లెట్లు కూడా పంచారు. సుమారు 12 ఏళ్ల నుంచి ఆ చిలుకను తాము పోషిస్తున్నట్లు చెప్పిన వారు… ఎవరి దగ్గర ఉన్న తమకు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. అంతేగాకుండా.. ఆ చిలుకకు సంబంధించి సమాచారాన్ని ప్రస్తుతం సోషల్ మీడియో కూడా పోస్ట్ చేసారు. అయితే చిలుక కోసం వీరు చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియో వైరల్ అవుతోంది.