Garikapati Narasimha Rao: తెలుగు వారికి గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పండితుడు, ఉపాధ్యాయుడు, కవి, వచన కర్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు గరికపాటి. గరికపాటి ప్రసంగాలు టీవీ లలో, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతాయి. తరచూ ఏదో ఒక అంశంపై విరుచుకుపడుతూ తనదైన శైలిలో మాటల గారడీ చేస్తాడు.
ఇదిలా ఉంటే గరికపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ విరుచుకుపడ్డాడు. ఈ రోజుల్లో సినిమాలు రౌడీ, ఇడియట్ అంటూ వస్తున్నాయి. ఈమధ్య బాగా విజయం సాధించిన పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే వాళ్ళను మంచిగా చూపించారు.
అదేంటి అని అడిగితే చివరిలో మంచిగా చూపిస్తాం లేకపోతే పుష్ప టు తీస్తాం, పార్ట్ త్రి తీస్తాం అంటారు. అంటే మీరు పార్ట్ టూ తీసే వరకు సమాజం చెడి పోవాలా? నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా తీయడం వల్ల స్మగ్లింగే గొప్ప అనే భావన కలిగింది. పైగా తగ్గేదే లే.. అంటాడ.
ఈ సినిమాను ఎంతమంది కుర్రవాళ్ళు ఆధారంగా తీసుకుని తగ్గేదే లే అంటే ఏంటి పరిస్థితి అని గరికపాటి వ్యక్తం చేశాడు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కానీ ఆ సినిమా హీరో డైరెక్టర్ ను నాకు సమాధానం చెప్పమనండి. నేను గట్టిగా అడిగేస్తాను. దాంట్లో సందేహమే లేదు అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను బయటికి తెలిపాడు గరికపాటి.