ఎన్నికలు అంటే ఒకరు గెలవాలి… ఒకరు ఓడాలి. గెలిచిన వారికి పదవి వస్తుంది. ఓడిన వారికి అనుభవం వస్తుంది. కానీ గెలుపు, ఓటమి అనేవి మాత్రం తప్పవు. అయితే ఇలా ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి చేసిన పనులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తనకు ఓటు వేయలేదు అనేదే కోపంతో గ్రామస్థుల మీద కసితో రగిలిపోయాడు ఆ వ్యక్తి. అంతేగాకుండా తన ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కరిపై పగ తీర్చుకోకుండా.. కొత్త ఎత్తు వేశాడు. అందరికి సంబంధించి కొన్ని ఉమ్మడి ఆస్తులను ధ్వంసం చేశాడు. అయితే ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సాధారణంగా ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతీ ఒక్కరు భారీగా ఖర్చు చేస్తుంటారు. మాకు ఓటు వేయండి మాకు వేయండి అని వారి వారి స్టైల్ లో అడుక్కుంటారు. కానీ తెలివైన ఓటర్లు ఎన్ని తాయిలాలకు లొంగరు. అన్నీ తీసుకున్నా కానీ కచ్చితంగా వారు అనుకున్న వారికే ఓటు వేస్తారు. అయితే ఇటీవల మనకు పక్క రాష్ట్రం అయిన ఒడిశాలో జరిగిన ఓ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఒడిశాలో గణపతి జిల్లాలో ఓ గ్రామం ఉంది. అయితే ఇటీవల ఆ గ్రామానికి ఎన్నికలు జరిగియి. ఆ సర్పంచ్ పదవికీ ఇద్దరు పోటీ పడ్డారు. వారిలో ఒకరు బారిక్ సబర్ కాగా మరోకరు హరిబంధు కర్జీ. ఇయితే ఈ ఎన్నికల్లో బారిక్ సబర్ అనే వ్యక్తి హరిబంధు అనే అభ్యర్థిచేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో కోపం తెచ్చుకున్న బారిక్ గ్రామంలో వేసిన రోడ్లను మనుషులను పెట్టి తవ్వించేశాడు. అంతేగాకుండా వీధి దీపాలను పగల కొట్టేందుకు కూడామనుషులను పురమాయించాడు. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.