Site icon 123Nellore

చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి నారాయణ

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓటమి షాక్ తో బయటకు రాలేదా..లేక పార్టీ మనుగడపై నమ్మకం లేకనో ఏ మారణమో తెలియదు కానీ చాల మంది నేతలు పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ జాబితాలో ముందున్న వారిలో ఇయ్యంకులుగా ఉన్న మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ ఉన్నారు. ఈ ఇద్దరు పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు తమ అధినేత చంద్రబాబును కలవలేదు. అంతే కాదు కనీసం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.

అంతేకాదు..గంటా శ్రీనివాసరావు అయితే ఏకంగా అసెంబ్లీకి సైతం రావడం లేదు. వైసీపీలో చేరతారన్న వార్తలు కూడా గతంలో ఎక్కువగానే వచ్చాయి. కానీ ఈ రూమర్లపై గంటా స్పందించలేదు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం గంటాను బయటకు తెచ్చింది. విశాఖ ఉక్కు కోసం తన పదవికి రాజీనామా చేస్తానని, ఉద్యమం నుండి వచ్చిన వారినే బరిలో దింపుతామని కూడా ప్రకటించి, రాజీనామా లేఖను కూడా స్పీకర్ కు పంపారు. అయితే తర్వాత ఏం జరిగిందోకానీ రాజీనామా అంశం మళ్లీ తెరపైకి రాలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ గంటా యాక్టివ్ అయ్యారు. ఎన్టీఆర్ వర్థంతిని కూడా నిర్వహించారు.

మరోనేత నారాయణ అయితే అసలు మూడేళ్లుగా బయటకు రాలేదు. కానీ శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాయంలో నారాయణ చంద్రబాబును కలశారు.  ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మూడేళ్లు స్తబ్ధుగా ఉన్న నారాయణ ఉన్నఫలంగా అధినేతను కలవడం పార్టీనేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అధినేతతో ఏం మాట్లాడారనేది తెలియదు. దీంతో మళ్లీ నారాయణ యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగుతారనే వార్తలు ఊపందుకున్నాయి.

Exit mobile version