రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు భాషలలో తెరకెక్కిన చిత్రం
ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరిత్రలో ఎప్పుడు ఏ సినిమా విషయంలో జరగని విధంగా రాజమౌళి ఈ సినిమా విషయంలో థియేటర్ ఓనర్ హీరో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దగ్గర అగ్రిమెంట్ పై సంతకాలు చేయించిన్నట్లు తెలుస్తోంది.
జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం కొన్ని థియేటర్లు ఎన్టీఆర్ అభిమానులకు మరికొన్ని థియేటర్లు చరణ్ అభిమానులకు కేటాయించినట్లు సమాచారం.అలాగే థియేటర్ బయట వేసిన ఫ్లెక్సీల వల్ల కూడా ఎలాంటి గొడవలు పడకుండా ఉండటం కోసం అగ్రిమెంట్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా విడుదలైన తర్వాత ఎవరు గొడవలు పడకుండా అందరూ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తూ సినిమాకు మంచి విజయాన్ని అందించాలని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొన్నారు. మరి ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరు హీరోల అభిమానులు సినిమాకు విజయాన్ని అందిస్తారా? లేదా సినిమాని కష్టాల్లో పడేస్తారా? తెలియాల్సి ఉంది.