Site icon 123Nellore

చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు

మనం తీసుకునే ఆహార పదార్థాలు వయసుతో సంబంధం లేకుండా చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. తీసుకునే ఆహారం వల్లే అందం మరియు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. చర్మంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. చిన్న తనంలోనే చర్మం పూర్తిగా మారుతుంది. ఇది సహజమైన మార్పు అయినప్పటికీ సరైన ఆహారం మరియు మంచి జీవనశైలి ద్వారా చర్మ వృధాప్యం కాకుండా ఉంటుంది. విటమిన్ ఏ మరియు కెరాటిన్ చర్మాన్ని వృధాప్యం నుండి కాపాడుతుంది. పాలకూరలో ఇవి పుష్కలంగా ఉంటాయి. మీరు దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటే మీ చర్మంలో నలభైలలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సబ్జా గింజలు కూడా ముందంజలో ఉంటాయి.

ఇందులో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ప్రతి రోజూ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల చర్మ పునరుజ్జీవనం పొందుతుంది. టమోటా కూడా చర్మాన్ని సౌంధర్యంగా ఉంచుతుంది. ఇందులో లూకోపీన్ ఉంటుంది. ఇది అనేక యాంజీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. లైకోపీన్ కాలుష్యం మరియు హానికరమైన సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. బాదం పప్పులో సౌందర్యానికి అవసరమైన విటమిన్ ఇ మరియు యాంటీ యాక్సిడెంట్లు చాలా ఉన్నాయి.

ప్రతిరోజూ నాలుగు బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని తింటే చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. కీర దోసకాయ తినడం వల్ల చాలా మంచింది. విటమిన్ కె.పుష్కలంగా ఉంటుంది. కానీ కాయ రూపంలో తినకుండా రసాన్ని ముఖానికి పూయడం ద్వారా మచ్చల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరేంజ్ లో సి విటమిన్ ఎక్కువుగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది. దీని ద్వారా శరీరానికి సులభంగా సరఫరా అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి ఆరేంజ్ లో ఉంటుంది. ఇది చర్మాన్ని సౌందర్యంగా ఉంచుతుంది.

 

Exit mobile version