ప్రసవించిన వెంటనే తల్లిలో ఆరోగ్యపరంగా, ఆహార పరంగా చాలా ఆందోళనలు ఉంటాయి. అప్పుడే ప్రసవించిన తల్లులు, శిశువుకు పాలు పట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ఆమె తీసుకొనే ఆహారంమే శిశువుకు పాల ద్వారా పోషణకు అంధించబడుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం అప్పుడే ప్రసవించిన తల్లులకు అంత ఆరోగ్యకరమైనది కాదు. అటువంటి ఆహారాలను నివారించాలి . అయితే, కొత్త తల్లులు కొన్ని ఆహారాలు తెలిసో, తెలియకో తీసుకోవడం వల్ల శిశువుకు అవాంఛిత ప్రభావాలు కలిగిస్తాయని తెలుసుకోవటం లేదు. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్యపరంగా తల్లి, గ్యాస్ కు కారణం అయ్యే అన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అధిక ఫైబర్ కలిగినటువంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
ముఖ్యంగా క్యాప్సికమ్ మరియు ముల్లంగి వంటి వెజిటేబుల్స్ కు దూరంగా ఉండాలి. ఇటువంటి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు శిశువు యొక్క పొట్టను అప్ సెట్ చేస్తాయి. గర్భదారణ సమయంలో, గర్బిణీని కాఫీ తాగడానికి అనుమతించరు. అదే విధంగా ప్రసవం తర్వాత వెంటనే కాఫీ తాగాలనే ఆత్రుత తల్లిలో ఉన్నప్పుడు, మరికొన్ని నెలలు కాఫీకి దూరంగా ఉండటం మేలు. కెఫిన్ కలిగిన పానియాలు తాగడం వల్ల శిశువులో క్రాంకీ మరియు ఇరిటేషన్ ను సృష్టిస్తుంది. ఇది కూడా శిశువు నిద్ర సమయంలో నిద్రపోనివ్వకుండా శిశువు మేలుకొని ఉండేలా చేస్తుంది.
బాలింతలు, శిశువుకు పాలిచ్చే సమయంలో స్పైసీ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమమైన మార్గం. స్పైసీ ఫుడ్ తిని శిశువుకు పాలు పట్టిన తర్వాత శిశువులో ఫస్సీకి కారణం అవుతుంది . కాబట్టి తల్లులు పాలిచ్చే తల్లులు, స్పైసీ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమమైన మార్గం. బాలింతలు అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే, తీసుకొనే మోతాదుకానీ, రెగ్యులర్ గా తీసుకోవడం కానీ మించితే ఖచ్చితంగా శిశువు మీద ప్రభావం పడుతుంది. అది శివువు అధిక బరువుకు దారితీస్తుంది.