Site icon 123Nellore

ఈ నెలలో భూమిని ఢీ కొట్టనున్న 5 శకలాలు.. నిజమెంత?

సాధారణంగా ఈ ప్రపంచం అంతమైపోతుందని ఎన్నో రకాల ప్రకటనలు చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెలలో ఎంతో ప్రమాదకరమైన భారీ శకలాలు భూమిని ఢీకొట్టబోతున్నాయని నాసా ప్రజలను హెచ్చరించింది. అయితే ఈ గ్రహశకలాలు నిజంగానే భూమిని ఢీకొట్టబోతున్నాయా.. ఇవి భూమిని ఢీకొడితే వచ్చే ప్రమాదం ఏమిటి? ఆ ఐదు గ్రహశకలాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

4660Nereus: గ్రహశకలం అత్యంత భారీ గ్రహ శకలం అని నాసా వెల్లడించింది. దీని పొడవు సుమారు 330 మీటర్లు ఉంటుందని ఇది ఒక సెకండ్ కు 6.78 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని తెలిపారు. ఈ గ్రహశకలం డిసెంబర్ 11వ తేదీ భూమికి అత్యంత దగ్గరగా రానుంది.అయితే ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చిన భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నాసా వెల్లడించింది.

163899: ఇది మరొక అత్యంత పొడవైన గ్రహశకలం ఇది 769 నుంచి 816 మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఇది భూమికి దగ్గరగా డిసెంబర్ 17 వ తేదీ వచ్చిన భూమినుంచి 54 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

2016TR54: ఈ గ్రహశకలం డిసెంబర్ 24వ తేదీ భూమికి దగ్గరగా రానుంది. ఇది 100 నుంచి 230 మీటర్ల పొడవు ఉంటుంది.ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 64 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా నాసా ప్రకటించింది.

2018AH: ఈ గ్రహశకలం కూడా 84 నుంచి 190 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. ఈ గ్రహశకలం డిసెంబర్ 28వ తేదీన భూమికి 89 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నాసా ప్రకటించింది.

2017AE 3: ఈ గ్రహశకలం పరిమాణం 120 నుంచి 260 మీటర్ల దాకా ఉంటుందని నాసా అంచనా వేసింది. డిసెంబర్ నెలలో భూమి పైకి వచ్చే ఆస్టరాయిడ్స్ లో ఇది అత్యంత పెద్ద అయిన ఆస్ట్రాయిడ్ ఇది డిసెంబర్ 29 వ తేదీ భూమికి దగ్గరగా రానుంది. అయితే ఈ గ్రహముల సకలం భూమికి వచ్చిన సమయంలో31 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవు.

Exit mobile version