Site icon 123Nellore

ర్యాంబో రాంబాబూ… అలా అయితే గొడ్డలి పోటు కుట్ర బయటపెట్టేవాళ్లం : బీటెక్ రవి

ర్యాంబో రాంబాబు..మీ ముఖ్యమంత్రి చేతగాని వాడా? సోదికబుర్లు ఆపి కల్తీసారాపై సమాధానం చెప్పండి అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి వైసీపీ ముఖ్యులపై నిఘాపెట్టి కుట్రపన్నారని వైసీపీ ఎమ్మెల్యే ర్యాంబో రాంబాబు తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన స్క్రిప్ట్ ను మీడియా ముందుకు వచ్చి వల్లె వేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పెగాసిస్ సాఫ్ట్ వేర్ ప్రభుత్వాలకు తప్ప వ్యక్తిగతంగా ఎవరికీ విక్రయించలేదని వివరించారు.

ఒకవేళ చంద్రబాబు హయాంలో రాష్ట్రప్రభుత్వం తరపున పోలీసుశాఖ పెగాసిస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ఉన్నట్లయితే అది పోలీసు విభాగం రికార్డుల్లో ఉంటుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కనుక పోలీసువిభాగం నుంచి రికార్డులు తెప్పించుకొని అదే వాస్తవమైతే ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కె.నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి పెగాసిస్ సాఫ్ట్ వేర్ పై సమాచారచట్టం కింద అడిగిన ప్రశ్నకు 12 ఆగస్టు, 2021న గౌతమ్ సవాంగ్ కార్యాలయం సాఫ్ట్ వేర్ ఏది కొనుగోలు చేయలేదని సమాధానమిచ్చినట్లు స్పష్టంచేశారు.

ర్యాంబో రాంబాబుకు ఏమైనా అక్షరజ్జానం ఉన్నట్లయితే సంబంధిత ఆర్టీఐ పత్రాలను కూడా జతచేస్తున్నామని, ఒకసారి ట్రాన్స్ లేటర్ తో తర్జుమా చేయించుకొని తెలుసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నిజంగా పెగాసిస్ లాంటి అడ్వాన్స్ డ్  సాఫ్ట్ వేర్ చంద్రబాబు హయాంలో ఉండి ఉంటే బాబాయ్ గొడ్డలిపోటు వెనుక ఉన్న కుట్రను ఆనాడే బయటపెట్టి ఉండేవాళ్లమన్నారు. రాష్టంలో కల్తీసారా మరణాలపై ప్రజలనుంచి పెద్దఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలకమైన ఆ సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తమకు వెన్నతో పెట్టిన విద్య అయిన అబద్దాలను జగన్ రెడ్డి మరోమారు ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

 

Exit mobile version