నీటిలో చేపలు ఈదుతాయి. అందమైన శరీరంతో హొయలు పోతూ… చేపలు రకరకాల విన్యాసాలు చేస్తాయి. అయితే నీటిలో జీవించే అన్ని జంతువుల కన్నా చేపలు మాత్రమే ఈదుతాయి. ఒకరకమైన నాట్యంతో ఆకట్టుకుంటాయి. కానీ ఇక్కడ ఓ మొసలి కూడా నాట్యం చేసింది. కేవలం నీటిలో ఉండాల్సి ఈ జంతువు ఏకంగా గాలిలోకి ఎగిరింది. భారీ శరీరంతో ఉన్నా సరే ఈ మొసలి నాట్యం చేస్తున్నట్లుగా పై పై కి ఎగిరింది. తనకు ఆధారం అయిన నీటిని విడిచి అంత ఎత్తు ఎందుకు ఎగిరింది అనే అనుమానం మీకు కూడా వస్తుంది కదా?
నీటిలో ఉండే బలమైన జంతువుల్లో మొసలి ఒకటి. భారీ కాయాన్ని కలిగి ఉండే దీనికి మనుషులను సైతం నీటిలోకి లాగిపడేసేంత శక్తి ఉంటుంది. అయితే అటువంటి మొసలి ఫీట్లు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. తేలికైన శరీరం తో నీటిపై ఎగరడం సులభమే. కానీ భారీ శరీరం తో పైకి కిందకు ఎగురుతూ.. దూకడం అంత ఈజీ కాదు.
ఆహారం కోసం ఓ మొసలి చేసిన ఫీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. నీటిపై పైకి, కిందకు ఎగురుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ మొసలి. ఇటువంటి మొసలి ఫీట్లు ఎప్పుడు చూడలేదు బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొసలి ఫీట్లు మాములుగా లేవుగా అంటూ షేర్ చేస్తున్నారు. లైకుల మీద లైకుల కొడుతున్నారు. నీటి పై ఎగురుతున్న మొసలి.. చుట్టూ పచ్చని చెట్లు, పక్షులు… ఉన్న ఆ వీడియో మీకోసం..