Site icon 123Nellore

అడవిలో ఫిజిక్స్​ సూత్రం ఉపయోగించి ఏనుగును బయటకు తీసిన అధికారులు.!

పశ్చిమ బంగాల్​ లో ఓ పెద్ద గుంతలో పడిన ఏనుగును అధికారులు రక్షించిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సాధారణంగా అడవిలో ఉండే ఏనుగులు బయటకు రావడం అనేది చాలా అరుదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అలాంటి ఘటనలు ఒక్కటి కూడా చూడలేము. ఏనుగులు ఎప్పుడు అయినా బయటకు వచ్చాయి అంటే అది ఎక్కువ భాగం నీటి కోసమే అయ్యి ఉంటుంది. అవి ఉండే ప్రాంతాల్లో తాగేందుకు నీరు దొరకని పక్షంలో అవి నీటిని వెతుక్కుంటూ బయటకు వస్తాయి. అయితే ఇలా వచ్చినప్పుడు అవి పెద్ద పెద్ద గుంతల్లో కానీ, బావిల్లో కానీ పడిపోతాయి. వాటిని బయటకు తీయాలి అంటే చాలా కష్టం అవుతుంది.

Elephant Rescue In Bengal Using Archimedes Principle Delights

ఇలా నీరు తాగుదాం అని వచ్చి.. ఓ పెద్ద గుంతలో పడిపోయింది ఓ ఏనుగు. ఈ ఘటన బంగాల్ లోని మిడ్నాపుర్ కు సమీపంలో ఉండే ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఏనుగు పడిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు చాలా చురుగ్గా స్పందించారు. సింపుల్గా దానిని బయటకు తీశారు. చిన్నప్పుడు మనం చదువుకున్న ఆర్కిమెడిస్ థియరీ ని ఇక్కడ అప్లై చేసారు. దీంతో ఏనుగు సులువుగా బయటకు వచ్చింది.

గుంతలో పడిన ఏనుగు మొదట బయటకు వచ్చేందుకు తొండం ద్వార ట్రై చేసింది. కానీ అది కాలేదు. తాళ్లు వేసి లాగాలి అంటే చాలా ఇబ్బంది అని గ్రహించిన అధికారులు ఆ గుంతలోకి నీళ్లు ఫుల్​ గా పంపారు. దీంతో ఆ ఏనుగు తేలియాడుతు పైకి వచ్చింది. అలా వచ్చిన దానిని సింపుల్గా బయటకు లాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఫారెస్టు అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

Exit mobile version