వడగాలులు తీవ్రమయ్యాయి. ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్తే సెగలు గక్కుతోంది. ఈ ఎండల్లో బయటకు వస్తే ఇంకేమైనా ఉందా.? నెత్తి నుండి అరికాలు వరకు ఒళ్లంతా మండే ఉంటుంది. అందుకే బాడీని కూల్ గా ఉంచుకోవడానికి ఫ్రూట్స్ వాడితే మంచిదని చెప్తున్నారు వైద్యులు. అవి తినడం వల్ల బాడీ చల్లబడటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయని చెప్తున్నారు. అవేంటంటే.. వేసవిలో ఎక్కువగా లభించే/విక్రయించే పండ్లలో పుచ్చకాయ ప్రధానంగా కనబడుతుంది. ఈ పుచ్చకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. అందుకే దీన్ని వాటర్ మెలాన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో.
పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేషన్‌తో పాటు జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉంటుంది. పుచ్చకాయలోని నీరు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవి వచ్చినప్పుడు, ఎల్లో రసం ఎక్కువగా అమ్ముతారు. ఈ జ్యూస్ తాగితే హీట్ స్ట్రోక్ రాకుండా పొట్టను చల్లగా ఉంచుతుంది. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించుకోవాలంటే రోజూ ఈ ఎల్లో జ్యూస్ తాగేలా చూసుకుంటే మంచింది. వేసవిలో కీరదోస లేదా దోసకాయలు ఎక్కువగా అమ్ముడవుతాయి. ఇవి సహజంగా పొలాల్లో లభిస్తాయి. శరీరంలోని వేడితో బాధపడేవారు దానిని తగ్గించుకోవడానికి దోసకాయలను ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇందులో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
దీంతో శరీరం చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇక మెలోన్ ఫ్రూట్ కూడా వేసవిలో ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అందుకు ఈ పండును యధాతధంగా లేదా జ్యూస్ రూపంలో తినవచ్చు. స్ట్రాబెర్రీలు కూడా ఎండా కాలంలో చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో ఈ పండును తింటే, అది రిఫ్రెష్‌గా ఉండవచ్చు. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది