Site icon 123Nellore

సీఎం డిల్లీ పర్యటన గోప్యతపై  ప్రజల్లో అనుమానాలు : ఎంపీ కనకమెడల

ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనపై గోప్యత పాటించటం రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం నాడు  జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినపుడు అక్కడ జరిగిన చర్చల సారాంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ‎ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 3 ఏళ్లలో 15  సార్లు డిల్లీ వెళ్లారు. కానీ ఎప్పుడు వెళ్లినా అక్కడ కేంద్రాన్ని ఏం అడిగారో మాత్రం ప్రజలకు ఎందుకు  చెప్పటం లేదు?  నిన్న కేంద్రానికి రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం, జాతీయ ఆహార భద్రత చట్టం, కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్దిక పునర్ వ్యవస్తీకరణ  అంశాలపై రిఫ్రజంటేషన్ ఇచ్చారని  మీడియాకు సమాచారం ఇచ్చారు.

కానీ ఈ మద్య కాలంలో జగన్ 3 సార్లు వెళ్లారు, ఈ 2 సార్లు కూడా ఇవే అంశాలు  రిప్రంజేటేషన్ ఇచ్చారు.  ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రతిపక్షంలో ఉన్నపుడు 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ రెడ్ ‎ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ‎ కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని ప్రాధేయపడటం తప్ప కమాడింగ్, డిమాండింగ్  చేయలేమని జగన్ రెడ్డి అన్నారు. రేపు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తగిన బలం లేదని వైసీపీ మద్దుతులోనే బీజేపీ సూచించిన అభ్యర్ది నెగ్గగలరని  వైసీపీనే అంటోంది. కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేంద్రం మెడలు వంచి హోదా సాధించేకుందు ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారా?

ఈ అంశంపై ‎ప్రధానితో ఏమైనా చర్చించారా?  జగన్ వ్యక్తిగత డిల్లీ పర్యటన అయితే మాకు సంబందం లేదు. కానీ ‎ 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా అధికారికంగా  ‎వెళ్లినపుడు  అక్కడ జరిగిన అంశాల్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవ‎సరం  ఉంది.   వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల్ని కూడా బెదిరిస్తున్నారు.  సాక్షుల్ని ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివేకా హత్యకేసులో క్రూరమైన నిజాలు బయటకు వస్తాయని సీబీఐ విచారణ నిలపేయమని కోరారా? ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం అ‎న్న బీసీపీ పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టినా ప్రశ్నించలేని స్ధితిలో జగన్ ఉన్నారు.’’ అని దుయ్యబట్టారు.

Exit mobile version