Site icon 123Nellore

ఆ గ్రామంలో కుక్కలపై రివేంజ్ ప్లాన్ చేసిన కోతులు… నెలలో 250 కుక్కల హత్య

మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా మజల్గావ్ ప్రాంతంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో కుక్కలు ఎక్కువగా చనిపోతున్నాయి. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు స్థానికులు ఓ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో కుక్కల్ని కోతులు చంపుతున్నాయి అని ఉండడంతో అధికారులు షాక్ అయ్యారు. కుక్కల జోలికి కోతులు ఎందుకు వస్తాయి అన్నది వారి ప్రశ్న.

దీంతో విచారణ జరిపిన అధికారులు విస్తుపోయే విషయాన్ని కనిపెట్టారు. నెల కిందట ఓ కోతి పిల్లను కుక్కలు చంపాయి. అంతే… అప్పటి నుంచి కుక్కలపై పగబట్టిన కోతులు వాటిని చంపుతున్నాయి. ఇలా నెల రోజుల్లో 250 కుక్కల్ని చంపేశాయని తెలిసింది. కాగా ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మనుషులు ఎలాగైతే మర్డర్లు చెయ్యడానికి ప్లాన్ వేసుకుంటారో… అలాగే కోతులు కూడా కుక్కల్ని చంపేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాయి. రోడ్డుపై వెళ్లే ఊరకుక్కపై ఒకేసారి గుంపుగా కోతులు దాడి చేస్తున్నాయి. దాంతో ఆ కుక్కలో పోరాడే శక్తి నశిస్తోంది.

ఆ తర్వాత ఆ కుక్కను ఇళ్లు, చెట్లపైకి లాక్కుపోతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి వదిలేస్తున్నాయి. అంతే… అలా కుక్కలు కింద పడుతుంటే… వాటి ప్రాణాలు పైకి పోతున్నాయి. మొదట్లో మజల్గావ్ ప్రాంత ప్రజలు దీన్ని అంతగా పట్టించుకోలేదు. వాటి గోల తమ కెందుకులే అని అనుకున్నారు. కానీ రాను రాను కుక్క కనిపిస్తే చాలు వానరాలు… చంపే వరకూ వదలట్లేదు అని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఇక చేసేది ఏం లేక అటవీ శాఖ అధికారుల్ని ఆశ్రయించారని తెలిసింది. రంగంలోకి దిగిన అధికారులు ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోవడం గమనార్హం.

Exit mobile version