Site icon 123Nellore

మెట్లెక్కడంలో ఈ కుక్క స్టైలే వేరు..!

కుక్కలు మెట్లు ఎక్కడం ఎప్పుడు అయినా చూశారా…? సాధారణంగా కుక్కలు మెట్లు ఎక్కేటప్పుడు వాటి ముందు కాళ్లు ను ఉపయోగించి ఎక్కుతాయి.  ముందు ఉన్న రెండు కాళ్లను పైన ఉన్న మెట్టు మీద పెట్టి జంప్ చేస్తాయి. కానీ ఓ కుక్క మెట్లు ఎక్కిన విధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ శునకం యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన వారు ఓ రేంజ్ లో షేర్లు చేస్తున్నారు. దీంతో వీడియో వైరల్ అవుతుంది. ఎక్కువ మంది శునకం మెట్లు ఎక్కిన విధానంపై కామెంట్లు చేస్తున్నారు.

DOG STEPPING WITH BACK FOOT

ఈ వీడియో ఉన్న దాని ప్రకారం ఓ కుక్క దాని వెనుక భాగంతో మెట్లు ఎక్కేందుకు ట్రై చేస్తుంది. ఇలా  ఒకసారి ముందు రెండు కాళ్లతో.. మరో సారి వెనుక భాగంతో ఎక్కుతూ ఉంది. ఇలా ఆ కుక్కు మెట్లు ఎక్కడం చూసిన దాని ఓనర్ సరదాగా నవ్వుకుంటూ దానిని  వీడియో తీశాడు. దానిని కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో  వీడియో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను LIDBIBLE అనే ఓ ఇస్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేసింది. దీంతో  ఈ వీడియోను చాలా మంది చూశారు. ఇప్పటి వరకు దీనిని చూసిన వారి సంఖ్య 61 వేలకు పైగా చేరింది. సుమారు 8 వందల మంది దీనిపై కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది.

Exit mobile version