Site icon 123Nellore

ఒకే గదిలో ఇరుక్కుపోయిన చిరుత,కుక్క.!

చిరుత పులి అంటే భయ. పడిని వారంటూ ఎవరూ ఉండరు. వెంటాడి, వేటాడి మరీ చంపుతుంది. అందులోనూ అది ఆకలి మీద ఉంటే ఇంకేముంది? కనిపించిన ప్రతీ దానిని నోట్లో వేసుకుని చంపి తినేస్తుంది. అయితే ఓ చిరుత మాత్రం తనకు ఎంత ఆకలిగా ఉన్నా సరే కామ్​ గా ఉండింది. ఎదురుగా తనకు కావాల్సిన ఆహారాన్ని పెట్టుకుని కూడా దాని జోలికి కూడా పోకుండా ఉండిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?

Dog gets trapped inside toilet with leopard for hours, miraculously survives

కర్ణాటకలో ఓ చిరుత పులి ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చింది. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. వీధుల్లో తిరుగుతుండడం చూసిన వారు గజ గజ వణికారు. అయితే ప్రజలు ఎంత భయపడ్డారో అదే రేంజ్​ లో చిరుత కూడా భయపడింది. అందుకే ఓ ఇంట్లోని టాయిలెట్​ రూంలో దూరింది. అయితే చిరుత టాయిలెట్​ రూంలో దూరేందుకు మునుపే ఓ కుక్క కూడా అక్కడ ఉన్నది. కానీ కుక్కను చూసిన ఆ చిరుత ఏం చేయకుండా కామ్ గా ఉండి పోయింది. అలా అని కనీసం కుక్క కూడా ఆ చిరుతపై నోరేసుకుని భౌ.. భౌ.. అని అరవలేదు. మంచి అండర్​ స్డాండింగ్​ తో ఆ టాయిలెట్​ లోనే ఉండిపోయాయి.

అయితే చిరుత విషయం గురించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు ముందుగా కుక్కను రక్షించారు. అనంతరం ఓ చిరుతను బంధించి అడవిలో వదిలి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.

Exit mobile version