కణిత తొలగింపు కేసులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. ఒకటి రెండు కాదు. పెద్ద సంఖ్యలోనే కణిత తొలగింపు కేసులను మనం ఇటీవల చూశాం. సాధారణంగా అయితే మన శరీరంలో ఏవైనా అవయవాలు అవసరం అయిన దాని కంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసే వారు కూడా ఆ వ్యక్తులను వింతగా చూస్తారు. వాటిని మోసే వారు కూడా చెప్పలేనంతగా బాధపడుతుంటారు. అయితే ఇలాంటి కేసు ఒకటి గుజరాత్ లో వెలుగు చూసింది. ఓ మహిలో కడుపులో నుంచి సుమారు 47 కేజీల కణితను అధికారులు తొలగించారు.
మొదటగా ఈ కణిత ఆమె శరీరంలో ఓ చిన్న ట్యూమర్ గా ఏర్పడింది. ఇది ఇలా ఏర్పడి సుమారు 18 సంవత్సరాలు కావొస్తుందని సంబంధీకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమెకు 56 ఏళ్లు అని తెలిపారు. ఈ కణిత ఆ మహిళ పొత్తి కడుపులో ఏర్పడినట్లు చెప్పారు. అప్పుడు చిన్న ట్యూమర్ గా ఉన్నది రాను రాను పెద్దదిగా మారినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమె కడుపు బాగా ఉబ్బినట్లు వచ్చిందని అందుకే కణితను తొలగించినట్లు తెలిపారు. అయితే 47 కిజీల కణిత అంటే మామూలు విషయం కాదని అన్నారు.
తొలుత ట్యూమర్ గా ఏర్పడినప్పుడు దానిని తొలగించి ఉంటే బాగుండేదని వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలియక సుమారు 18 ఏళ్లు వేచి చూసినట్లు పేర్కొన్నారు. కేవలం ఆ మహిళ నిర్లక్ష్యం కారణంగా ఇలా పెద్దదిగా మారిందని వైద్యులు స్పష్టం చేశారు. ఆ కణిత ఇటీవల మోయలేని భారంగా మారినందు వల్ల ఈ మధ్యనే అహ్మదాబాద్ వైద్యులు ఆ మహిళకు ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి కణితను తొలగించినట్లు పేర్కొన్నారు.