ఈమధ్య కొన్ని అవసరాల ధరలు పెరుగుతున్నాయి.. తగ్గుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నిత్యావసరాల విషయంలో మాత్రం ధరలు బాగా బీభత్సంగా పెరిగాయి. ఇక తాజాగా మళ్లీ ధరలన్నీ మామూలు స్థితికి వచ్చాయి. అందులో తాజాగా చికెన్, గుడ్ల ధరలు మాత్రం చాలా తగ్గాయి. చాలా వరకు చికెన్, గుడ్లు చలికాలంలో తినటానికి చాలామంది ఇష్టపడుతుంటారు.
ఇక దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్నటి వరకు వీటి ధరలు భగ్గుమన్నాయి. కానీ ఇటీవలే జనవరి 3 నుంచి చికెన్, గుడ్ల ధరలు తగ్గాయి. కారణం రోజురోజుకు దేశంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల చోట్ల కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా త్వరలో లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉందని తెలిసింది.
దీంతో చికెన్, గుడ్లు సరఫరాపై అధిక ప్రభావం పడటం వల్ల వీటి ధరలు తగ్గిపోయాయి. ఇదివరకు 30 గుడ్లు రూ.200 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.150 కు మాత్రమే అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో 100 గుడ్లకు 450 రూపాయలు ధర అని తెలిసింది.ఇక చికెన్ ధర కూడా తగ్గిపోవడంతో తాజాగా చికెన్ 150 రూపాయలకు కిలో దొరుకుతుంది.
ఇదివరకు కిలో చికెన్ ధర 200 రూపాయలు ఉండేది. మొత్తానికి కోవిడ్ వల్ల నిత్యావసర ధరల పై ప్రభావం బాగా పడిందని అర్థం అవుతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ఒకేసారి గుడ్లను కొని తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. పైగా ఈ సమయంలో రోజుకు ఒక గుడ్డు తినడం చాలా మంచిది.