Coconut: మనం ఏదైనా శుభకార్యాలలో, గృహప్రవేశం లో ఇష్టంతో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. అలా కొబ్బరికాయ కొట్టిన సమయంలో అది రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు ఒకవేళ అందులో పువ్వు వస్తే పాజిటివ్ గా భావిస్తారు. లేక ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే నెగిటివ్ గా భావించి వారికి ఏదో ప్రమాదం పొంచి ఉందని లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలాంటివేమీ నిజం కాదని కొన్ని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
అసలు మనం కొట్టే కొబ్బరికాయ లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏదో చెడు జరుగుతుందని భావిస్తాం. నిజానికి కొబ్బరికాయ కుళ్ళిపోవడం అంటే కొబ్బరికాయ పువ్వు దశనుంచి మారి బాగా పండిపోయిందని అని అర్థం. సో కొబ్బరికాయ కొట్టిన వాళ్లకు ఎటువంటి అశుభ శకునం జరగదు.
మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా చేతులు శుభ్రంగా కడుక్కుని మరలా ఒక కొబ్బరికాయ కొట్టవచ్చు. అంతేగాని దీనివల్ల మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ మనుషులు ప్రాణం పోసిన ఒట్టి అపోహలు మాత్రమే.
చాలావరకు మనుషులందరూ నెగిటివ్ థాట్ లోనే ఉంటారు. పాజిటివ్ మైండ్ తో అస్సలు ఆలోచించరు. కాబట్టి అన్ని నెగిటివ్ గా ఊహించుకొని అన్నిటికీ భయపడుతూ ఉంటారు. ఇక మీదట ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇక వీలైనంతవరకూ అందరూ పాజిటివ్ గా ఆలోచించడం మంచిది. చాలామంది నెగిటివ్ గా ఆలోచించి వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు.