Site icon 123Nellore

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయటం వల్ల మనకు దక్కే ఫలితం ఏంటో తెలుసా..?

Shivratri: శివరాత్రి ఈరోజు హిందువులకు, శివ భక్తులకు ఎంతో ప్రత్యేకమైన రోజు శివరాత్రిని మన భారతదేశంలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు మొత్తం దేవాలయాల యందు దీపాలను వెలిగించి జాగరణ చేస్తారు.శివరాత్రిని శివ భక్తులే కాకుండా మహావిష్ణువు భక్తులు కూడా మహాశివుడిని పూజిస్తారు. మహాపర్వదిన శివరాత్రికి ప్రత్యేకత ఉంది అది ఏంటంటే పండితులు, పురాణాలు చెబుతున్న ప్రకారం ఈ రోజున లింగోద్భవం జరిగిందని అంతేకాకుండా ఈ రోజునే శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని అందుకే ఈ రోజును శివరాత్రిగా భావిస్తారు హిందూ భక్తులు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం, జాగరణ చేసి, మహాశివునికి అభిషేకం చేసి, నచ్చిన పువ్వులను, నైవేద్యాన్ని సమర్పిస్తే వారి కోరికలను తీరుస్తాడు అని హిందువుల నమ్మకం అందుకే ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు హిందువులు.

 

Shivratri

మహాశివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పిస్తే అనుకొన్న కోరికలు నెరవేరుతని భావిస్తారు. అందుకే ఈ రోజున ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మహా శివునికి పూజలు చేస్తారు. ఈ రోజున కొంతమంది ఉపవాసం ఉండి, జాగరణ కూడా చేస్తుంటారు అయితే కొంతమంది ఉపవాసంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకుంటారు. మరికొంతమంది కేవలం ద్రవపదార్థాలను తీసుకుంటూ ఆ రోజు మొత్తం శివుని స్మరణ చేసుకుంటూ ఉంటారు. ఇలా శివుడికి ఈ రోజున పూజ చేసి, జాగరణ,ఉపవాసం చేయడం వల్ల పాపాలు అన్ని తొలగిపోతాయి అని నమ్మకం.

అయితే సృష్టి ప్రారంభం కి ముందు బ్రహ్మ, విష్ణు, శివుడులలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగిందట దాంతో శివుడు లింగ రూపాన్ని ధరించి ఆ లింగానికి ఆది అంతం కనుక్కోవాలని సూచించాడు. బ్రహ్మ, విష్ణు లింగం ఆది, అంతాలను ఎంత ప్రయత్నించినా కనుక్కోలేరు. బ్రహ్మ లింగం ఆది అంతాలను కనుక్కో ఉంటున్న సమయంలో గోమాత, మొగలి పువ్వు దర్శనమిస్తారు. వారితో నేను ఆది అంతాలను కనుక్కున్నాను అని శివుడికి అబద్ధం చెప్పమంటారు వారు కూడా పరమశివుడికి అబద్ధం చెప్తారు. దాంతో పరమశివుడు కోపగించి మొగలి పువ్వు ను పూజకు పనికిరావు అని శపిస్తాడు.

ఇక గోమాత విషయానికి వస్తే గోమాత ముఖంతో అబద్ధం చెప్పిన తన తోకతో నిజం చెప్పగా ఆవు ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. విష్ణువు మాత్రం తాను లింగానికి అంతం కనుక్కోలేకపోయానని నిజం చెప్పడంతో శివుడు ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహించారు. ఇక ఇలాంటి పవిత్రమైన రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పరమశివుడి కి జలం తో అభిషేకం చేసినా కూడా పరమశివుడు పరవశించి కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని హిందువుల నమ్మకం. ఇలా ఈ రోజున పెళ్లికాని అమ్మాయిలు ఉపవాసం జాగరణ చేయడంవల్ల వారికి మంచి భర్త, మంచి జీవితం దొరుకుతుందని, అలాగే వివాహమైన మహిళలు ఇలా ఉపవాసం,జాగరణ ఉండటంవల్ల వారి కుటుంబానికి, వారి సంతానానికి అంతా మంచే జరుగుతుందని భావిస్తారు.

Exit mobile version