Site icon 123Nellore

పుష్ప స్పెషల్ సాంగ్ కు సమంత తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Samantha: ఎర్రచందనం నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ యాక్టింగ్ వేరే స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ ఎత్తున సక్సెస్ అందుకోవడానికి కొంత కారణం చిత్తూర్ యాస. ఈ యాస లో అల్లు అర్జున్ ప్రేక్షకులను మరింత మెప్పించాడు.

Samantha

మొత్తానికి బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో హడావిడి చేశాడు. ఇక ఈ సినిమా అంతా ఒక ఎత్తయితే.. ఇందులో సమంత ఆడిన ఊ అంటవా మావ.. ఊ ఊ అంటావా మావ.. అనే స్పెషల్ సాంగ్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఈ సాంగ్ తో సమంత ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకుంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.

గ్లోబల్ నెంబర్ వన్ సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ పాట చేసేందుకు సమంత కోట్లలోనే రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదట్లో చిత్ర బృందం ఆమెను అడిగినప్పుడు ఈ పాట చేసేందుకు ఒప్పుకోలేదట. కేవలం అల్లు అర్జున్ చెప్పడం వల్లే సమంత ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మూడు నిమిషాల పాట చేసేందుకు దాదాపుగా 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చేసేందుకు మొదట్లో కొన్ని షరతులు విధించారట కానీ.. సాంగ్ షూటింగ్ సమయంలో కూడా ఒక్క స్టెప్పును కూడా మార్చమని అడగలేదని ఈ చిత్ర బృందం తో సంబంధం ఉన్న ఒక పర్సన్ తెలిపారు.

Exit mobile version