Site icon 123Nellore

మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Sankranthi Festival: హిందువులు.. సంవత్సరంలో వచ్చే అన్ని పండగలలో సంక్రాంతి పండుగను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి సంక్రాంతికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆ సమయంకు సొంత ఊర్లకు చేరాల్సిందే. ఎందుకంటే ఈ పండుగ పల్లెటూర్లలో బాగా అద్భుతంగా జరుగుతుంది. సంక్రాంతి సమయంలో గంగిరెద్దులా మేళాలు, బసవన్న లతో వీధి వీధంతా మంచి హడావిడిగా ఉంటుంది.

Sankranthi Festival

ఈ సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పాటు జరుపుకుంటే మరికొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల వరకు హడావిడి చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రాలో కోడి పందాలు. భోగి పండుగ రోజున భోగి మంటలు వేసి భోగి మంటలులో ఇంటిలో పనిచేయని పాత సామాన్లు వేసి కొత్తదనాన్ని సంపాదించుకుంటారు.

కొన్ని ప్రాంతాలలో భోగి పండుగ రోజున పెద్దగా బొమ్మలకొలువును కూడా ఏర్పాటు చేస్తారు. ఇక పోతే రెండో రోజు సంక్రాంతి. ఆ రోజు కొత్త అల్లుడిని కూతురిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెడతారు. మకర సంక్రాంతి పేరుతో గాలిపటాలను కూడా ఎగుర వేస్తారు. పలు పిండి వంటలు కూడా వండుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మూడవ రోజు కనుమ. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. కనుమ పండుగ రోజు రైతులు పశువులను పూజిస్తారు. ఈ పండుగ రోజు ఇంట్లో పెద్దవారు ఎవరైనా చనిపోతే వారికి కొత్త బట్టలు పెడతారు. ఇక కక్కా ముక్కా.. పేరుతో మాంసాహారం వండుకొని.. వాటికి మినప గారెలు జోడించి తింటారు.

Exit mobile version