కాఫీ.. మనిషి జీవితంలో నిత్యకృత్యమైన వస్తువు ఇది. ఢిల్లీ నుండి గల్లీ వరకు కోట్లాది మంది దీనికి ప్రయులయ్యారు. పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు పలుమార్లు కాఫీ తాగుతుంటారు. మరి కొందరు స్టడీ అవర్స్, డ్రైవింగ్ సమయంలో నిద్రపోకుండా ఉండేందుకు సైతం కాఫీని తాగుతారు. వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు కాస్తంత రిలీఫ్ అవ్వడికి కూడా కాఫీ తాగుతారు. అయితే ఈ కాఫీ తాగితో అనర్థాలని కొందరంటే..సింహ ప్రయోజనాలు ఉన్నాయని మరి కొందరు అంటున్నారు. ఇంతటీకి ఏంటా ప్రయోజనాలు చూద్దామా..? కొన్ని పరిశోధనల్లో కాఫీ తాగడం వల్ల పలు వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు పరిశీలకులు.
మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించడానికి ఈ కాఫీ కాస్త ప్రయోజనాన్ని చేకూరిస్తుంది. గుండె సంబంధిత రోగాలు కూడా నయమవుతాయని తేలింది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా తాగితే పప్పులో కాలేసినట్లే. ఒక మోతాదులో మాత్రమే తాగితే ప్రయోజనం కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. కప్పు కాఫీ వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. తక్కువ అలసటను పొందుతారు. రెండు కప్పుల వల్ల వ్యాయామ పనితీరులో గణనీయమైన మెరుగుదల ఉంటుంది.
గుండె ఆగిపోయే అవకాశాలు కూడా కొంత తగ్గుతాయి. మూడు కప్పుల వల్ల మరణాల ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. నాలుగు నుండి ఆరు కప్పుల కాఫీ తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గడం, డయాబెటిస్ ప్రమాదాన్ని కొంత తగ్గించడం, కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం తగ్గుదల ఉంటుంది. ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య, భయము, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటివి పెరిగే ప్రమాదం ఉంది.
గమనిక : ఇవి పాటించాలనుకున్నప్పుడు డాక్టర్లను తప్పని సరిగా సంప్రదించండి.