Site icon 123Nellore

నిద్రపట్టాలంటే ఇలా చేయండి..!

సుఖంగా నిద్రపోయే అవకాశం అందరికీ ఉండదు..రాదు కూడా. కానీ చాలా మందికి నిద్రపోవడం అంటే బాగా ఇష్టం. కంప్యూటర్ల ముందు కూర్చుని, ఆలోచనలు ఎక్కువైనప్పుడు మనిషికి సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర లేమి సమస్య మనిషికి చాలా ప్రమాదం. దీని వల్ల కంటి సమస్య, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వేళకు పడుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. దానికి కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని భావిస్తున్నారు. తెల్లారిన తర్వాత రోజూ ఒకే సమయంలో నిద్ర లేచేలా అలవాటు చేసుకోవాలి. అలారంతో పనిలేకుండా ఇది ఒక దిన చర్యగా మొదలవ్వాలి.

తెల్లారితే సెలవు కదా..ఆలస్యంగా పడుకుంటే మాత్రం..మరుసటి రోజు మెలుకువ కూడా రాదు. కాబట్టి సెలవు రోజుల్లో కూడా సమయానికి నిద్రపోయాలే చూసుకోవాలి.  సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటల లోపు వ్యాయామం చేయాలి. రాత్రి పూట మితంగా భోజనం చేయడం వల్ల కూడా నిద్ర కూడా బాగా పుడుతుంది. మగవారికైతే పొగతాగే అలవాటు ఉంటే పడుకోవడానికి రెండు గంటల ముందు నుండే దానికి దూరంగా ఉండాలి.

కాసేపట్లో పడుకుంటామనగా మనసును ఉత్తేజితం చేసే పనులు..టీవీ చూడటం, కంప్యూటర్ ముందు కూర్చోవడం, సెల్ చూడటం వంటి వాటిని మానెయ్యాలి. పడుకోవడానికి రెండు గంటల ముందు గదంతా చీకటి ఉండేలా చూసుకోవాలి.  నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చగా ఉండే పాలు తీసుకోవాలి.  మైండ్ లో ఎలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. మరుసటి ఏం చేయాలి అని, అందుకు సంబంధిత ఆలోచనలు నిద్ర సమయంలో దూరం పెట్టాలి. నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంటే ద్యానం చేస్తే మంచిది. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే మంచింది. శరీరాన్ని కాస్త అలసట పడేలా చేసుకుంటే నిద్ర మంచిగా వస్తుంది.

Exit mobile version