Site icon 123Nellore

లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా… ఇక అంతే సంగతులు అని గుర్తు పెట్టుకోండి !

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చాలా మంది మొబైల్ ల‏కు బానిసలుగా మారిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్‏లో మునిగిపోతున్నారు. దాదాపు 61 శాతం మంది ప్రజలు నిద్రపోయే ముందు, నిద్రలేచిన తర్వాత కొంత సమయం ఫోన్‏లో గడిపేస్తారని ఇటీవలే ఓ అధ్యాయనంలో తేలింది. అంతకు ముందు ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోనో లేకపోతే అరచేతులను చూసేవారు, కానీ ఇప్పుడు ఆ రోజులకు కాలం చెల్లింది అని అనిపిస్తుంది.

నిద్రలేచిన వెంటనే ఏ నోటిఫికేషన్లు వచ్చాయి, ఎవరు ఏ స్టేటస్ లు పెట్టారంటూ లేచిన మొబైల్ ను చెక్ చేసుకోవడం చేస్తున్నారు. అయితే పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్లను చూడటం చాలా ప్రమాదరకరమంటున్నారు వైద్య నిపుణులు. ఇలా కొనసాగితే త్వరలోనే కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ గుర్తు చేస్తున్నారు. అవేంటో మీకోసం…

నిద్ర లేవగానే కళ్లు తెరచి ఫోన్ చూడటం వల్ల దాని నుంచి వెలువడే లైటింగ్ నేరుగా కళ్లపై పడుతుంది. ఈ లైటింగ్ వల్ల ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల తల బరువుగా మారి సరిగ్గా ఆలోచించకపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తీవ్రమైన తలనొప్పి సమస్య కూడా వేధిస్తుందని సూచిస్తున్నారు.

ముఖ్యంగా నిద్ర లేవగానే ఫోన్ చూసే వారిలో అధిక రక్తపోటు సమస్య వేధిస్తున్నట్టు తేలింది.

రాత్రి సమయంలో ఎక్కువ సేపు సెల్ ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.

అలానే చిన్న విషయానికి కూడా చిరాకు పడటం, కోపగించుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ఇప్పటి నుంచి అయినా సెల్ ఫోన్ ని కొంచెం మితంగా వాడితే మంచిది.

Exit mobile version