ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి బాగా అలవాటు అయిన విషయం మొబైల్ వినియోగం. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రకు ముందు వరకు నిత్యం సెల్ ఫోన్ ని వాడుతూనే ఉంటున్నారు. మొబైల్ చేతిలో లేకుండా రోజు గడవని పరిస్ధితి నెలకొంది. అయితే నిద్రలేవ గానే మొబైల్ చూసే అలవాటు చాలా డేంజరంటున్నారు నిపుణులు. ఇలాంటి వారు ఆపద్దతి మార్చుకోకుంటే భవిష్యత్తులో చాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
నిద్ర లేచిన వెంటనే మొబైల్ ని చూడడం వల్ల లైటింగ్ కిరణాలు కళ్లకు తీవ్ర హానికలిగిస్తాయట. ఈ లైటింగ్ కళ్లకు ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. దీని వల్ల శరీరక ఒత్తిడి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తల బరువుగా ఉండటం…సరిగా ఆలోచించలేకపోవటం వంటి పరిస్ధితులు ఏర్పడతాయి. అలానే ఉదయాన్నే ఫోన్ చూసే వారిలో రక్తపోటు సమస్య తలెత్తుతున్నట్లు ఇటీవల పలు అధ్యయానాల్లో తేలింది. ఈ సమస్య చివరకు తీవ్రస్ధాయికి చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. రాత్రిళ్లు పొద్దు పోయే వరకు మొబైల్ ఫోన్ లో గడపటం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది.
నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ తో దినచర్యను ప్రారంభించటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల చిన్న విషయాలకే చిరాకు పడటం, అనుకున్న పనులను సక్రమంగా చేయలేకపోవటం, నిస్సత్తువ వంటి పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేవగానే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ చూసే అలవాటును మానుకోవటం మంచిది అని నిపుణలు సూచిస్తున్నారు.