Site icon 123Nellore

ఆ సినిమాపై కీలక అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్ పూరి!

Puri jagannadh: టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికి తెలిసిందే. ‘బద్రి’ చిత్రం ద్వారా తనలోని దర్శకత్వాన్ని బయటపెట్టి.. ఆ పై పలు చిత్రాలకు ప్రాణం పోసి హీరోలకు సైతం ప్రత్యేకమైన ఫేమ్ తెప్పించాడు ఈ పూరి. ఎంతైనా పూరి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక టాలీవుడ్ అగ్ర స్టార్ డైరెక్టర్ల లో తాను ఒకడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Puri jagannadh

ఇదిలా ఉంటే పూరి తాజాగా తాను తెర మీదకు తీసుకురావాల్సిన ‘జనగణమన’ సినిమా గురించి ఓ కీలకమైన అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పూరి మొదట్లో మహేష్ బాబుతో అనుకున్నాడు. కానీ తర్వాత ఆయన అంచనా ఎలా మారిపోయిందో గానీ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నాడు.

ఇక చివరికి ఈ స్టోరీకి హీరోగా విజయ్ దేవరకొండ ను ఫిక్స్ చేసాడట. అంతేకాకుండా ఈ స్టోరీ విన్న దేవరకొండ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా విడుదల కాస్త లేటు అవడంతో పూరి ఈ సినిమాపై ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. పోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Exit mobile version