అధిక బరువు పెరగడం వల్లన చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అలానే గర్భం దాల్చినప్పుడు కూడా శరీరంపై ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. ఇటువంటి మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పురుషులు అధిక బరువు ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి. వాటిని తొలగించు కోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాటిని మన రోజువారి దినసరి లో అనుసరించిన స్ట్రెచ్ మార్క్స్‌ని తొలగించుకోవచ్చు. మరి అవి ఏంటో తెలుసుకుందాం.
కోకో బటర్ ప్రధానంగా చాలా క్రీములలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కోకో బటర్‌ను స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేసి బాగా మసాజ్ చేసుకొవాలి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె కూడా స్ట్రెచ్ మార్క్‌లను పోగొట్టడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది మీ చర్మానికి పోషణ, తేమను అందించడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా కూడా స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో బాగా పని చేస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేయాలి.
20 నిమిషాల పాటు అలాగే ఉంచి క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజు చేయడం ద్వారా అద్భుతం ఫలితం కనిపిస్తుంది. దోసకాయ స్ట్రెచ్ మార్క్‌కు మంచి ఫలితం అందిస్తుంది. దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమాన భాగాలుగా కలపి స్ట్రెచ్ మార్క్‌పై అప్లై చేయాలి. చర్మంపై కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మీరు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటించడం వల్లన చర్మం అందంగా మారుతుంది.