Health Benefits: వాము వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ వాము మొక్క సువాసనను కలిగి ఉంటుంది. ఈ చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉండే పూల నుండి విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలను మనం వాము అంటాం. ఇది శరీరంలో వాతాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ వాము వలన కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం జీర్ణం అవ్వక బాధపడేవారు వామును పొడిచేసి వేడినీటిలో వేసి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగు పరచవచ్చు. అదే వామును కొద్దిగా వేయించి ఉప్పుతో పొడి చేసిన మిరియాలను కలిపి భోజనంలో మొదటి ముద్ద ద్వారా తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలను దూరం పెట్టవచ్చు. జ్వరం కలిగినప్పుడు వాము, జీలకర్ర, ధనియాలు దోరగా వేయించి కషాయం మాదిరిగా మరిగించి తీసుకుంటే జ్వరం కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పవచ్చు.
అంతే కాకుండా తల్లిపాలు వృద్ధి చెందడానికి ఈ వాము బాగా సహాయపడుతుంది. ఇక కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు వామును నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కొంత వరకు కరిగే అవకాశం ఉంది. వాము పొడిని గుడ్డతో కట్టి వాసన పీల్చడం ద్వారా తలనొప్పి, జలుబుని దూరం పెట్టవచ్చు. వామును క్రమంగా ప్రతిరోజు ఎంతో కొంత తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులను కొంతవరకు అరికట్టవచ్చు. ఇక పొడి దగ్గుతో బాధపడేవారు తమలపాకులో వాము వేసి నమలడం ద్వారా పొడి దగ్గుకు చెక్ పెట్టవచ్చు.