Site icon 123Nellore

పుష్ప సినిమాలో చంద్రబాబు ఉన్నాడని మీకు తెలుసా?

Chandrababu Naidu In Pushpa: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం థియేటర్ లో తెగ సందడి చేస్తుంది. ఎర్రచందనం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్తూరు యాసతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్నీ వెర్షన్ లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Chandrababu Naidu In Pushpa

ఈ సినిమా ఈ ఏడాది జనవరి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో విడుదలయింది. ఇదంతా పక్కనపెడితే తాజాగా పుష్ప సినిమాలో చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది. సినిమాను ఎంతో ఉత్సాహంగా చూసినా సినిమాలో ఉన్న చంద్రబాబు మాత్రం మనం కనిపెట్టలేకపోయాం.. అదేంటి? చంద్రబాబు ఉండడం ఏంటని ఆలోచిస్తున్నారా.. నిజంగానే చంద్రబాబు ఫోటోల రూపంలో ఉన్నాడు. అది ఎవరూ కనిపెట్టలేకపోయారు.

పుష్ప సినిమాను 1995 మధ్య కాలంలో జరిగినట్టు చూపించారు దర్శకుడు సుకుమార్. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అప్పుడు జరిగిన ఘర్షణ నేపథ్యం గురించి ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాడు కాబట్టి.

అందుకే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుంది. సినిమాలో పుష్ప మొదటిసారి పోలీసులకు పట్టుబడ్డప్పుడు స్టేషన్ లో పెట్టి బాగా కొడతారు. ఆ సమయంలో వెనక గోడకు చంద్రబాబు నాయుడు ఫోటో కనపడుతుంది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version