Bangarraju: తండ్రి కొడుకు కాంబినేషన్ లో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా ఈ సంక్రాంతికి థియేటర్లో బాగానే హడావిడి చేసింది. గతంలో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సీక్వెల్ లో వచ్చిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో
నాగార్జున, నాగ చైతన్య.. తాతా-మనవడు గా మెప్పించారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి లు మెయిన్ రోల్స్ చేశారు.
ఇక ఈ సినిమా కొంత వరకు సక్సెస్ బాట పట్టిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు ఆ సినిమా లూప్ హోల్స్ నెటిజన్లు కనిపెడతారు. అదే క్రమంలో ఈ సినిమాలో కూడా ఓ మిస్టేక్ ని వెలికి తీశారు. అదేమిటంటే.. ఈ సినిమా స్టార్టింగ్ లో చిన్న బంగార్రాజు తల్లి సీత చనిపోయిన విధంగా చూపించారు. ఆ తర్వాత కొంత సేపటికి పెద్ద బంగార్రాజు స్వర్గంలో రంభ ఊర్వశి మేనక లతో డ్యూయెట్ లు చేసినట్టు చూపించారు.
ఇక డ్యూయెట్లు అయిపోగానే సత్తెమ్మ స్వర్గం లోకి వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కింది లోకానికి రావడం కింద లోకంలో పరిస్థితులు మెరుగుపరచడాన్ని అందరు చూసారు. కానీ సత్తెమ్మ కంటే ముందు చనిపోయిన సీత ఎందుకు కనిపించలేదని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఈ సినిమా దర్శకుడు ఇలా స్పందించారు.
సినిమాలో లావణ్య త్రిపాటి ఉంటే చైతన్య కు తల్లిగా చూపించాల్సి ఉంటుంది. ఇదివరకే చైతన్య సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. కాబట్టి ఆమె ఆ పాత్రను కంటిన్యూ చేయడం బాగోదనే ఇలా చేసాం అని ఈ సినిమా డైరెక్టర్ తెలిపారు.