టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. అయితే వారి విడాకుల గురించి ప్రకటించి కూడా ఇప్పటికీ అయిదు నెలలు అయిపోయింది. అయినా ఇంకా ఈ విషయాన్ని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. వాళ్లు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వారిద్దరి గురించి ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత పెళ్లి చీర గురించి మరోసారి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి డివోర్స్ తర్వాత సమంతనే ఎక్కువగా ఫోకస్ అయింది. అందరు ఆ చేదు జ్ఞాపకాలు మరిచేలా తన రెగ్యులర్ ఫొటోస్, పాజిటివ్ కొటేషన్స్ షేర్ చేస్తూ వచ్చింది. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగ చైతన్యకు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయాలని ఫిక్స్ అయిన సామ్, తన పెళ్లి చీర సహా అన్నీ తిరిగి ఇచ్చేసిందనే సమాచారాలు తెగ షికారు చేస్తున్నాయి. నాగ చైతన్య కుటుంబం నుంచి వచ్చిన అనేక విలువైన వస్తువులను సమంత తిరిగి పంపిందనే టాక్ నడుస్తోంది.
తమ పరిచయం నుంచి.. పెళ్లి వరకు జరిగిన ఘట్టాలను చీరపై నేయించి కట్టుకుంది సామ్. ఇక హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్ళిలో సామ్.. కట్టుకున్న చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ళ్లి రోజు సమంత ధరించిన ఆ శారీ దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే నాగ చైతన్య అమ్మమ్మది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు గౌరవ సూచకంగా ఈ చీరను చీరను సమంత పెళ్లి రోజు కట్టుకుంది. ఆ చీర పొందడం ఎంతో అదృష్టమని కూడా చెప్పుకోచ్చింది. ఇక తాజా సమాచారాన్ని బట్టి ఆ పెళ్లి చీర, చైతన్యకు సంబంధించిన ప్రతి వస్తువును ఆమె అక్కినేని కుటంబానికి తిరిగి ఇచ్చేసిందట. చైతు జ్ఞాపకాలను కనీసం గుర్తుతెచ్చే ఏ వస్తువును సామ్ దగ్గరికి కూడా రానివ్వడం లేదట. ఇందులో నిజం ఏమాత్రం ఉందో తెలీదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.